సారథి, మానవపాడు: అంతా కలిసిమెలిసి బక్రీద్ పండుగను జరుపుకోవడం సంతోషకరమని జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు ఎస్సై సంతోష్ కుమార్ అన్నారు. మండల కేంద్రంలోని జామియా మసీద్ కమిటీ, ఖలీల్ యూత్ ఆధ్వర్యంలో యువకులకు రెండేళ్ల క్రితం క్రికెట్ టోర్నీ నిర్వహించారు. కరోనా నేపథ్యంలో బహుమతులను ప్రదానం చేయలేదు. బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకొని విజేతలకు మొదటి బహుమతి, సీనియర్ కెప్టెన్ శాలిబాషా జట్టుకు, జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతి ఇద్రుస్ జట్టుకు ఎస్సై సంతోష్ కుమార్, మాడుగుల ఎంపీడీవో ఫారూఖ్ ప్రదానం చేశారు. కార్యక్రమంలో జామియా మసీద్ ముతవల్లి మహబూబ్, ఉపసర్పంచ్ పహిల్వాన్, మండల మాజీ కోఆప్షన్ మెంబర్ అజీమ్, వీఆర్వో హుస్సేన్, టీచర్ శాలం, మెడికల్ హుస్సేన్, మహమ్మద్, ఖలీమ్, షాకీర్, సాధిక్, నిర్వాహకుడు అబ్దుల్ ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.
- July 21, 2021
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- ALAMPUR
- bakreed
- GADWALA
- MANAVAPADU
- అలంపూర్
- గద్వాల
- బక్రీద్
- మానవపాడు
- Comments Off on వేడుకగా బక్రీద్ పర్వదినం