- బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: తెలంగాణలోని ప్రతి పల్లెలో గడప గడపకు బహుజన సమాజ్ పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని బీఎస్పీ రాష్ట్ర ముఖ్య సమన్వయకర్త డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ, తిమ్మాజిపేట మండల కేంద్రం, తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామాల్లో బహుజన సమాజ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నేతలు బీఎస్పీ ఎదుగుదలను చూసి ఓర్వలేక, భయంతోనే జెండా గద్దెలు కూర్చున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బిఎస్పి అధికారంలోకి రావడం తథ్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని ప్రజలను కోరారు.