Breaking News

ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి

ఘనంగా బాబు జగ్జీవన్ రాం జయంతి

సారథి, రామాయంపేట/పెద్దశంకరంపేట/రామగుండం: జనం కోసమే జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రాం అని నిజంపేట మండల ఉపసర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు కొమ్మట బాబు కొనియాడారు. సోమవారం బాబు జగ్జీవన్ రాం 114వ జయంతిని పురస్కరించుకుని మండలకేంద్రంలో కొత్త బస్టాండ్ ఆవరణలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గెరిగంటి లక్ష్మీ నర్సింలు, చల్మేడ ఎంపీటీసీ నంద్యాల బాల్ రెడ్డి, నందిగామ మాజీ సర్పంచ్ స్వామి, కొమ్మట చంద్రం, సిద్ధరాములు, కొమ్మట రాములు, వడ్డే మల్లేశం, దాసు పాల్గొన్నారు.

పెద్దశంకరంపేటలో వేడుకలు
పెద్దశంకరంపేటలో దళిత సంఘాల ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రాం 114 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దళిత బహుజన హక్కుల సంఘం వ్యవస్థాపక సంఘం అధ్యక్షుడు సంగమేశ్వర్ మాట్లాడారు. దళిత అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం మహనీయుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రాం పోరాటం చేశారని కొనియాడారు. విద్యార్థి దశలోనే సామాజిక మార్పుకోసం ఆయన ఉద్యమించారన్నారు. స్వతంత్ర పోరాటంలో భాగస్వామి అయి గాంధీజీతో పాటు సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. కేవీపీఎస్​ జిల్లా అధ్యక్షుడు తుకారాం, దళిత సంఘాల జేఏసీ నాయకులు రోమాల సాయిలు, కిషన్,మోహన్, శ్రీ రామ్ కుమార్, నరేష్ పాల్గొన్నారు.

రామగుండంలో ఘనంగా వేడుకలు
రామగుండం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో డాక్టర్ బాబు జగ్జీవన్ విగ్రహం వద్ద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ, కాసిపేట లింగయ్య, గోదావరిఖని వన్ టౌన్ సీఐ గంగాధరి రమేష్ బాబు, ట్రాఫిక్ ఎస్సై గాలిపెళ్లి నాగరాజు, కార్పొరేటర్లు మహంకాళి స్వామి, పెద్దపల్లి తేజస్విని ప్రకాష్, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు, జయంతి ఉత్సవ కమిటీ నేతలు డాక్టర్ బాబు జగ్జీవన్ రాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.