సామాజికసారథి, బిజినేపల్లి: బిజినేపల్లి మండలంలోని గుడ్లనర్వ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య భూవివాదం నెలకొనడంతో తమ్ముడిని అన్న, అతని కుమారుడు ఇద్దరి కలిసి పంటపొలాల్లో హత్యా యత్నం చేశారని బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. బాధితుడు భీముని సంతోష్ తెలిపిన వివరాలు.. తనకు, అన్నకు ఇద్దరు మధ్యలో గ్రామంలో పొలం ఉన్నదని, కొంత భాగాన్ని తనకు ఇవ్వాలని పదే పదే చెప్పడంతో వారు దానికి అంగీకరించలేదు. భీముని సంతోష్ గ్రామంలోని పెద్దలకు భూమిలో భాగం కావాలని పదేపదే ఫిర్యాదులు చేస్తున్నాడంటూ భూమికి అడ్డు వస్తున్నాడని అన్న ఆంజనేయులు అతని కుమారులు కలిసి పంట పొలాల్లో తమ్ముడు సంతోష్ ను కాళ్లు చేతులు కట్టేసి చితక బాదారు. అంతే కాకుండా చెట్ల మధ్యన వేసి చంపేందుకు ప్రయత్నం చేస్తుండగా అటుగా వచ్చిన కొందరు బాటసారిలు వెళ్లడంతో అది గమనించి వారిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఇది గుర్తించిన గ్రామస్తులు వెంటనే సంతోష్ ను తాళ్లు తీసివేసి గ్రామానికి తీసుకపోవడంతో వెంటనే బాధితుని పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు తరలించినట్లు వారు తెలిపారు.
- February 11, 2023
- Archive
- Top News
- మహబూబ్నగర్
- ముఖ్యమైన వార్తలు
- తెలంగాణ
- Comments Off on గుడ్ల నర్వలో భూ వివాదంలో హత్యాయత్నం