Breaking News

ఇద్దరు వ్యక్తుల అరెస్టు

ఇద్దరు వ్యక్తుల అరెస్టు
  • వీరిపై పలు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు
  • జైలుకెళ్లి బెయిల్ పై బయటికి వచ్చిన నిందితులు
  • జల్సాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడుతున్నారు
  • వివరాలు వెల్లడించిన బీడీఎల్ సీఐ వినాయక్ రెడ్డి

సామాజిక సారథి, పటాన్‌చెరు: డ్యూటీకి కాలినడకన వెళ్తున్న ఇద్దరు కార్మికులను అడ్డగించి బెదిరింపులకు పాల్పడ్డడమే కాక ఒకరిని చెట్లు పొదల్లోకి తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తూ, లైంగిక దాడికి పాల్పడ్డా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. బానూర్ బీడీఎల్ సీఐ వినాయక్ రెడ్డి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 20వ తేదీన రాత్రి 8:30 సమయంలో అస్సాం రాష్ట్రానికి చెందిన శంకర్ దాస్, శుభాంకర్ ఇద్దరు కార్మికులు పాశమైలారంలోని ఓ పరిశ్రమలో పనిచేసేందుకు వెళ్ళారన్నారు. సిద్దాపూర్, సదాశివపేట మండలంకు చెందిన మహమ్మద్ కలీం, కొల్లకేరి సదాశివపేటకు చెందిన మహమ్మద్ యూనిస్ అను ఇద్దరు వ్యక్తులు స్కూటీపై ఎదురుగా వచ్చి, ఢీకొట్టడమే కాకుండా దాడికి పాల్పడ్డారని చెప్పారు. శుభాంకర్ పారిపోగా శంకర్ దాసుని స్కూటీపై ఎక్కించుకొని కంది శివారులోకి చెట్లపదలోకి తీసుకెళ్లి రూ. 50వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నా దగ్గర లేవు అనడంతో బాధితుడు అన్న ప్రేమ్ గిరిదాసు కు ఫోన్ చేసి రూ. 50వేలు తీసుకొస్తేనే మీ తమ్ముడిని వదిలేస్తామని బెదిరించారు. రూ. 30వేలు ఇస్తానంటూ సుధాకర్ గౌడ్ తీసుకొని సంఘటన స్థలానికి వెళ్లిపోగా శంకర్ దాస్ వద్ద ఉన్న రూ.100 లాక్కొని లైంగిక దాడికి పాల్పడ్డారని తెలిపారు. నిందితులపై బీడీఎల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకొని సోమవారం పాశమైలారం పారిశ్రామికవాడలో గల పోలీస్ ఔట్ పోస్టు దగ్గర వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరి నిందితులు పట్టుబడ్డారు. ఇంతకుముందే మహమ్మద్ ఖలీమ్ పై ఝరాసంఘం, సదాశివపేట పోలీస్ స్టేషన్లలో రెండు కేసులు, కలీంపై సదాశివపేటలో మూడు కేసులలో జైలుకు వెళ్లి మూడు నెలల క్రితమే బెయిల్ పై బయటికి వచ్చారని తెలిపారు. జల్సాలకు అలవాటు పడి ఇద్దరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఇద్దరి నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ వినాయక్ రెడ్డి, ఎస్సై సాయిలు తెలిపారు.