సారథి, ఉండవెల్లి/అయిజ(మానవపాడు): దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించిన పెగసిస్ స్ర్రైవేర్ ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం రాజ్ భవన్ ముందు ధర్నాకు బయలుదేరిన కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి ఉండవల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. సింగల్ విండో చైర్మన్ గజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అరెస్ట్‌లతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో కంచిపాడు సర్పంచ్ శేషన్ గౌడ్, మండలాధ్యక్షుడు గోపాల్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ రెడ్డి, చాంద్ బాషా, వెంకటేశ్వరరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్షావలి ఉన్నారు. అలాగే అయిజలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్‌చేశారు. పోలీస్ స్టేషన్ ముందు నిలబడి కేంద్ర ప్రభుత్వం, కేసీఆర్ నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ ఓబీసీ కార్యదర్శి మాస్టర్ షేక్షావలి ఆచారి పాటు బీసీ సెల్ టౌన్ ప్రెసిడెంట్ సాంబశివుడు, సీనియర్ నాయకులు హనుమన్న, మద్దిలేటి, బసవరాజు, ఫిరోజ్, శివశాలు, పహిల్వాన్లు పాల్గొన్నారు.
- July 22, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CONGRESS
- REVANTHREDDY
- TPCC
- కాంగ్రెస్
- టీపీసీసీ రేవంత్‌రెడ్డి
- మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్
- Comments Off on కాంగ్రెస్ నాయకుల అరెస్ట్