సారథి, చొప్పదండి: టీపీసీసీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి పిలుపు మేరకు రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి శుక్రవారం బయలుదేరిన చొప్పదండి కాంగ్రెస్ కార్యకర్తలను స్థానిక పోలీసులు అంబేద్కర్ చౌరస్తా వద్ద అడ్డుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించాలని నినాదాలు చేసారు. అనంతరం డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ఏడేళ్లలో పెరిగిన పెట్రోడీజిల్ ధరల వల్ల పేద, మధ్యతరగతి ప్రజలపై రూ.36 లక్షల కోట్ల భారం పడిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు లచ్చయ్య, కన్నమల్ల రాజశేఖర్, సంబోజి సునీల్, గొల్లె సంపత్, రాజేష్, వినోద్, రాజేందర్ పాల్గొన్నారు.
- July 16, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- CHOPPADANDI
- CONGRESS
- REVANTHREDDY
- TPCC
- కాంగ్రెస్
- చొప్పదండి
- టీపీసీసీ
- రేవంత్రెడ్డి
- Comments Off on కాంగ్రెస్ కార్యకర్తల అరెస్ట్