సారథి, నాగర్‌కర్నూల్: ముస్లింల పవిత్ర బక్రీద్ కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. బుధవారం పండుగ కావడంతో ఈద్గాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం కురిస్తే నమాజ్‌కు ఇబ్బందులు తలెత్తకుండా మసీదుల్లోనే ప్రార్థనలు చేసేలా ఏర్పాట్లుచేశారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులోని ఈద్గా వద్ద మున్సిపాలిటీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈద్గాకు పెయింటింగ్ వేయించడంతో పాటు ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేయించారు. స్టోన్డస్ట్పోసి బురదను సరిచేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని జామా మసీద్‌ను ముస్తాబు చేశారు. మసీద్ ఏ ఖమర్ ఉన్నిసా, మూసామసీద్ లో ఏడు గంటలకు, మసీద్ఏ మేరేజ్ లో ఏడున్నర గంటలకు, హౌసింగ్ బోర్డు కాలనీలోని మహ్మదీయ మసీదులో 8:30 గంటలకు వక్ఫ్ కాంప్లెక్స్ లోని మహాఫుజ్ బిన్ లో ఎనిమిది గంటలకు ప్రత్యేక నమాజ్ చేయనున్నారు. సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి నమాజ్చేయాలని ముస్లిం మతపెద్దలు కోరారు.
- July 20, 2021
- Archive
- మహబూబ్‌నగర్
- షార్ట్ న్యూస్
- BAKRID
- edgas
- NAGARKURNOOL
- నాగర్ కర్నూల్
- బక్రీద్
- Comments Off on బక్రీద్ పండుగకు ఏర్పాట్లు పూర్తి