సారథి, రామాయంపేట: పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్టంలో కులవృత్తులను రక్షించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని, రజక, నాయీ బ్రాహ్మణులను ఆదుకునేందుకు విద్యుత్ బిల్లు మాఫీ చేయడం పట్ల రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంఘ స్వామి హర్షం వ్యక్తంచేశారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దోభీఘాట్లకు, లాండ్రీ షాప్, సెలూన్ షాపులకు 250 యూనిట్లలోపు విద్యుత్ బిల్లు మాఫీచేయడం హర్షణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక ఉపసర్పంచ్ కొమ్మట బాబు, వార్డు సభ్యులు రాజవ్వ, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీనర్సింలు, రజకులు దుబ్బరాజు, సత్తయ్య, రాజు, బాబు, పరుశరాములు, రమేష్, రాజయ్య, లక్ష్మీ, బొందయ్య పాల్గొన్నారు.
- April 7, 2021
- Archive
- CM KCR
- RAMAYAMPET
- TRS GOVT
- టీఆర్ఎస్ ప్రభుత్వం
- నాయీ బ్రాహ్మణులు
- రామాయంపేట
- సీఎం కేసీఆర్
- Comments Off on సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం