Breaking News

ఇంటి వద్దకే అంగన్​వాడీ సరుకులు

ఇంటి వద్దకే అంగన్​వాడీ సరుకులు

సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఇంటివద్దకే వెళ్లి నేరుగా అంగన్​వాడీ సరుకులను అందజేస్తామని అల్లాదుర్గం సీడీపీవో భార్గవి తెలిపారు. బుధవారం మెదక్​జిల్లా పెద్దశంకరంపేటలోని పూసలగల్లీ, తిరుమలాపూర్ అంగన్​వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతిరోజు ఐదుగురు చిన్నారుల బరువు తూకం వేయాలని, అంగన్​వాడీ కేంద్రాల్లో టీచర్లు అందుబాటులో ఉండాలని సూచించారు. టీ షాట్ ద్వారా ప్రతిరోజు ఉదయం విద్యార్థులకు ప్లే ఆక్టివిటీపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అంగన్​వాడీ టీచర్లు సరళ, స్వరూప, అనురాధ ఉన్నారు.