Breaking News

విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరు

విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరు

సారథి, రామడుగు: దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఏఐఎస్ఎఫ్​ కీలక భూమిక పోషించిందని జిల్లా అధ్యక్షుడు మచ్చ రమేష్ ​గుర్తుచేశారు. గురువారం ఏఐఎస్ఎఫ్ 86వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఐఎస్ఎఫ్ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చదువు, పోరాడు అనే నినాదంతో ఉద్యమిస్తున్న ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ మాత్రమేనని అన్నారు. భగత్ సింగ్ లాంటి దేశభక్తులను ఆదర్శంగా తీసుకొని శాస్త్రీయ విద్యావిధానం, కామన్ స్కూలు విధానం కోసం పోరాటం చేసిందని తెలిపారు. విద్యార్థులు, విద్యారంగ సమస్యలపై అలుపెరుగని పోరాటాలు నిర్వహిస్తున్న ఘనమైన చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్రం కోసం మిలిటెంట్ ఉద్యమాలు చేసిందని చెప్పుకొచ్చారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నాయకులు మచ్చ క్రాంతికుమార్, రాజు, మచ్చ పవన్ కళ్యాణ్, వంశీ, ప్రశాంత్ పాల్గొన్నారు.