Breaking News

బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

బోల్తా పడిన ఆర్టీసీ బస్సు

సామాజిక సారథి‌, తల్లాడ: రోడ్డు మరమ్మతుల్లో భాగంగా ప్రమాద నివారణ చర్యలు లోపించి ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా పోలవరం నుంచి శనివారం రాత్రి మియాపూర్ కు బయల్దేరిన కొత్తగూడెం డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు మార్గమధ్యలో తల్లాడ మండలం అంబేద్కర్ నగర్ వద్ద గుంతలు తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఖమ్మం జిల్లా వీఎం బంజర్ చెందిన వంగాల నవీన్, తల్లాడకు చెందిన బొడ్డు శ్రీను, పశ్చిమ గోదావరి జిల్లా పాత పట్టిసీమకి చెందిన నాగమణి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఓట్ల పల్లికి చెందిన లక్ష్మి గాయపడ్డారు. సంఘటనా స్థలాన్ని కొత్తగూడెం డిపో మేనేజర్ వెంకటేశ్వర బాబు, వైరా సీఐ జెట్టి వసంతకుమార్, తల్లాడ ఎస్ఐ ఎం. సురేష్, సర్పంచ్ జొన్నలగడ్డ కిరణ్ బాబు సందర్శించారు. రోడ్డు మరమ్మతు పనులు జరుగుతున్న దృష్ట్యా భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు.