Breaking News

పేదలకు అన్నదానం

పేదలకు అన్నదానం

సారథి, వేములవాడ: కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో పేదలు ఆకలితో అల్లాడుతున్నారు. దీంతో పేదలు, కూలీలు, యాచకులు ఆకలితో అలమటించకూడదని టీఆర్ కే ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం చేస్తున్నారు. మంగళవారం 32వ రోజు పేదలకు ఆహారం అందజేశారు. పేదల కోసం శ్రమిస్తున్న మొట్టల మహేష్ కుమార్, ట్రస్ట్ సభ్యులు, వర్కింగ్ టీంలకు పలువురు ధన్యవాదాలు తెలిపారు.