ములుగు హాస్పిటల్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం
సారథి ప్రతినిధి, ములుగు: ములుగు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో బుధవారం రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణఆదిత్యతో కలిసి డయాగ్నోస్టిక్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ సెంటర్ లో 57 రకాల వైద్యపరీక్షలు చేయించుకోవచ్చన్నారు. సుమారు రూ.3కోట్ల వ్యయంతో పరికరాలను సమకూర్చి డయాగ్నోస్టిక్ సెంటర్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కరోనాను పూర్తిగా కట్టడి చేయడంలో ప్రజలంతా సహకరించాలని కోరారు. అనంతరం ఎంపీ మాలోత్ కవిత మాట్లడుతూ.. జిల్లా ప్రజలు ఎలాంటి సమస్యలు ఉన్నా ములుగు ఏరియా హాస్పిటల్ కు రావాలని కోరారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెడికల్ టెస్టులు నిర్వహిస్తారని, టీ.డయాగ్నోస్టిక్ సెంటర్ ను వినియోగించుకోవాలని మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత కోరారు. కార్యక్రమంలో ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జగదీష్ ,జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్యాం, సిబ్బంది పాల్గొన్నారు.