Breaking News

కలెక్టరేట్ లో తుపాకీతో గురిపెట్టాడు

కలెక్టరేట్ లో తుపాకీతో గురిపెట్టాడు

సామాజికసారథి, నాగర్​కర్నూల్: నిత్యం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలతో రద్దీగా ఉండే ప్రాంతం. జిల్లాకు సంబంధించిన పాలనా అధికారులు తమ కిందిస్థాయి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇస్తూ పాలన సాగించే ప్రాంగణం.. తుపాకీతో సినిమాలో హీరో లెవల్ లో గురిపెడుతూ సెల్​ఫోన్ ​ఫొటోలకు ఫోజులిచ్చాడు. ఇది చూసి అక్కడున్నవారు అవాక్కయ్యారు. పైగా ఈ ఫొటోలను సోషల్​మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్​గా మారింది. ఇది ఎక్కడో కాదు నాగర్​కర్నూల్​ జిల్లా కలెక్టరేట్​లో సోమవారం జరిగిన ఘటన ఇది. ఎవరా వ్యక్తి అనుకుంటున్నారా? జిల్లా అడిషనల్ ​కలెక్టర్ ​కారు డ్రైవర్.. కృష్ణ అనే వ్యక్తి నాగర్​కర్నూల్​ జిల్లా అడిషనల్​ కలెక్టర్ వద్ద కారుడ్రైవర్​గా పనిచేస్తున్నాడు. అడిషనల్ ​కలెక్టర్ ​తన చాంబర్​లో విధులకు వెళ్లిన తర్వాత కృష్ణ తుపాకీతో ఫొటోలకు ఇలా ఫోజులిచ్చాడు. ఫొటోలను ఫేస్​బుక్, వాట్సప్​లో పోస్ట్​చేయడంతో వైరల్​గా మారింది. పిస్తోల్​ ఎవరిది.. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందని పలు ఆరాతీయడం మొదలుపెట్టారు జనం. పొరపాటున ట్రిగ్గర్​ నొక్కితే ఏం జరిగేదో తెలుసా? అంటూ చర్చించుకోవడం కనిపించింది. ఈ ఘటనపై అధికారులు స్పందించాల్సి ఉంది.

One thought on “కలెక్టరేట్ లో తుపాకీతో గురిపెట్టాడు”

  1. Even though the gun is belongs to????…..but The collectrate should be in the eye of breaching security…. So

Comments are closed.