అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన చిత్రాలను ఓటింగ్ ద్వారా ఆస్కార్ మెంబర్స్ తుది జాబితాను తాజాగా రిలీజ్ చేశారు. ఇందులో అకాడమీ అవార్డుల బరిలో దాదాపు 300 చిత్రాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. 95వ ఆస్కార్ అవార్డుల ఎంపికలో ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు–నాటు’ సాంగ్ ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. డాక్యుమెంటరీ ఫీచర్ కేటగిరిలో షానూక్ సేన్ ‘ఆల్ దట్ బ్రెత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విష్పర్స్’ నామినేట్ అయ్యాయి. రిజ్ అహ్మద్, అల్లిసన్ విలియంలు వ్యాఖ్యాతలు కాగా, కాలిఫోర్నియా వేదికపై ఈ ఉత్కంఠ కార్యక్రమం జరిగింది. 22 సంవత్సరాల కిందట ‘లగాన్’ తర్వాత మరో భారతీయ చిత్రం ఆస్కార్ ఎంపింకవడం గమనించదగిన విషయం. అయితే ‘లగాన్’ తుది జాబితా వరకూ వెళ్లినా ఆస్కార్ దక్కలేదు. ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ కు ఏఆర్ రెహమాన్, రసూల్ పూ కుట్టి లను ఆస్కార్ వరించిది. కాగా మార్చి 13న ఈ ఆస్కార్ అవార్డుల ప్రదానం జరగనుంది.