- బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ పై చర్చ
- బీజేపీ, టీఎంసీ ఒక్కటేనని కాంగ్రెస్విమర్శలు
న్యూఢిల్లీ: తృణమూల్కాంగ్రెస్అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం, మమతాబెనర్జీని అపర కుబేరుడు గౌతమ్ అదానీ కలిశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బెంగాల్‌లో బెంగాల్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఆ కార్యక్రమం గురించి గురువారం కోల్‌కతాలో సీఎం మమతాబెనర్జీని కలిసి మాట్లాడినట్లు గౌతమ్ అదానీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆయన వెల్లడించారు. అంతే కాకుండా మమతా బెనర్జీని కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేశారు. ఇప్పటికే మోడీ ప్రభుత్వం అంబానీ, అదానీకి అనుకూలమనే విమర్శలు పెద్దఎత్తున్న వస్తున్న నేపథ్యంలో మమతా బెనర్జీపై కూడా అలాంటి విమర్శలే కాంగ్రెస్‌నేతలు చేస్తున్నారు. ఆమెను బీజేపీ బీ టీమ్అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. బీజేపీ, టీఎంసీ విధానాలు ఒకటేనని, కార్పొరేటర్లకు ప్రజాసొమ్మును దోచిపెట్టడమే వారి లక్ష్యమని విమర్శిస్తున్నారు. నరేంద్రమోడీ, మమతాబెనర్జీ ఇద్దరూ ఒక్కటేనని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ విషయమై తెలంగాణ కాంగ్రెస్ నేత సీతక్క కూడా విమర్శించారు. గౌతమ్ అదానీ ట్వీట్‌ని షేర్ చేస్తూ ‘ఐపాక్ నుంచి అదానీ వరకు మమతాబెనర్జీ ప్రయాణం.. డైరెక్టర్: మోడీ, ప్రొడ్యూసర్: అమిత్ షా’ అని రాసుకొచ్చారు.