సామాజిక సారథి, చిలప్ చెడ్: అది విత్తనాలు, కఠిన చర్యలు తప్పవని ఏవో బాల్ రెడ్డిఅన్నారు. గురువారం మండల కేంద్రం చిలప్ చెడ్ లో ఆగ్రో రైతు సేవా కేంద్రాన్ని ఏఓ బాల్ రెడ్డి, ఎస్సై మహ్మద్ గౌస్ లు తనిఖీచేశారు. ఈ సందర్భంగా ఏవో బాల్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు నకిలీ పురుగుల మందులు అమ్మితే చర్యలు తప్పవని ఆయన అన్నారు. రైతులకు ఎరువులు కానీ, విత్తనాలు కానీ, తీసుకుంటే రసీదు తప్పనిసరిగా ఇవ్వాలని ఆయన అన్నారు. స్టాక్ రిజిస్టర్లు, పలు రికార్డులను మెయింటెనెన్స్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ భూపాల్, ఆగ్రో రైతుసేవాకేంద్రం ప్రతినిధి శ్రీనివాస్, సోమక్కపేట సొసైటీ సీఈవో పోచయ్య, యాసిన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
సబ్సిడీపై జనుము, జిలుగ విత్తనాలు
ఆగ్రోస్ రైతు సేవ కేంద్రంలో పచ్చి రొట్ట, జనుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఏవో బాల్ రెడ్డి తెలిపారు. గురువారం ఆగ్రోస్ రైతు సేవ కేంద్రానికి పచ్చి రొట్ట విత్తనాలు రావడంతో పరిశీలించారు. ఈ సందర్భంగా ఏ వో బాల్ రెడ్డి మాట్లాడుతూ.. పచ్చి రొట్ట సాగు చేసి మూత దశలో నీళ్లలో కలిపి దున్నడంతో భూమి సారవంతమై పట్టబు కావాల్సిన పోషకాలు అందుతాయి అన్నారు. సబ్సిడీ పోను జీలుగ 30 కిలో బస్తాలు రూ.850, జనుము 40 కిలోల బస్తా రూ.1250 లభిస్తుందన్నారు. ఎకరాకు 12 కిలోల పచ్చిరొట్ట విత్తనాలు సరిపోతాయని తెలిపారు. కావలసిన రైతులు పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ రైతు సేవ కేంద్రంలో ఇచ్చి కొనుగోలు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఈఓ భూపాల్, ఆగ్రోస్ రైతు సేవా కేంద్రం ప్రతినిధి శ్రీనివాస్, సోమక్కపేట సొసైటీ సీఈవో పోచయ్య, యాసీన్, రమేష్, రామకృష్ణ గౌడ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.