సారథి, వేములవాడ: రాజన్న సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండల కేంద్రంలో గురువారం ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయశాఖ, పోలీసు అధికారులు తనిఖీ చేశారు. రైతులను ఎవరైనా నకిలీ విత్తనాలు, నాసిరకం పురుగుల మందులు విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. అలాంటి వారిపై గ్రామాల్లో పోలీసుల నిఘా ఉంటుందని. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. రైతులు లైసెన్సులు కలిగిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలుచేసి రికార్డులు పొందాలన్నారు. తనిఖీల్లో వేములవాడ డీఎస్పీతో పాటు సీఐ శ్రీలత, ఎస్సై సునీల్, మండల వ్యవసాయాధికారి దుర్గరాజు, పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
- June 4, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- AGRICULTURE
- SEEDS
- VEMULAWADA
- నకిలీ విత్తనాలు
- వేములవాడ
- వ్యవసాయశాఖ
- Comments Off on నకిలీ విత్తనాలు అంటగడితే చర్యలు