సామాజిక సారథి, నాగర్ కర్నూల్: అచ్చంపేట నియోజకవర్గంలో లక్కీ స్కీమ్ నిర్వహిస్తూ ప్రజలను మోసం చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసు కోవాలని మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ వంశీ కృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అండతో దోమల పెంట, బల్మూరుకు చెందిన టీఆర్ఎస్ నాయకులూ బోగస్ సంస్థలను నిర్వహిస్తున్నారని, ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జిల్లా ఎస్పీ ఈ విషయంపై దృష్టి పెట్టాలని తగు చర్యలు తీసుకోవాలని నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. జిల్లాలో సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలని అయన కాంగ్రెస్ నాయకులను సూచించారు. సమావేశంలో డీసీసీ ప్రధాన కార్య దర్శి అర్థం రవి, సభ్యత్వ నమోదు నియోజకవర్గ ఇంచార్జ్ ఆశిరెడ్డి, పార్లమెంట్ స్థాయి టెక్నీకల్ ఇంచార్జ్ మధుసూదన రెడ్డి, మాజీ ఎంపీపీ కోటయ్య, నాయకులు వెంకట్రామ్ రెడ్డి, సుహాసిని రెడ్డి, తాడూరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఐతోలు లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.
- January 3, 2022
- Archive
- లోకల్ న్యూస్
- Comments Off on నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి