సామాజిక సారథి, అచ్చంపేట: స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఏడురోజుల పాటు ‘స్మరిద్దాం ఈవేళ…’ పేరిట నిర్వహించిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో అచ్చంపేటకు చెందిన ప్రముఖ కవి, గాయకుడు, చిత్రకారుడు మండికారి బాలాజీ కి ద్వితీయ బహుమతి పొందారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, విద్యావేత్త చుక్కా రామయ్య , హృదయ భారతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మక్కపాటి మంగళ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మండికారి బాలాజీ మాట్లాడుతూ.. ఈ పురస్కారం ఎంతో ప్రతిష్టాత్మకమైందని అన్నారు. సమరయోధులను స్మరించుకునే అవకాశం కల్పించిన హృదయ భారతి చారిటబుల్ ట్రస్ట్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు.
- September 4, 2021
- Top News
- ACHAMPET
- azadi
- అచ్చంపేట
- ఆజాది కా అమృత్
- సాంస్కృతిక శాఖ
- స్మరిద్దాం ఈవేళ
- Comments Off on ‘ఆజాది కా అమృత్’లో అచ్చంపేట వాసి ప్రతిభ