సారథి న్యూస్, మెదక్: మొబైల్ కు ఆధార్ నంబర్ అనుసంధానం చేసేందుకు మీ- సేవా, ఈ-సేవా కేంద్రాలు మార్చి 31వ తేదీ వరకు రాత్రి 9గంటల వరకు పనిచేస్తాయని మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తెలిపారు. కోవిడ్-19 వాక్సిన్ వేసుకునేందుకు పేరు నమోదుకు ఆధార్ ఆధారిత మొబైల్ ఓటీపీ ఆవశ్యకత ఉన్నందున ఈ వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని ఆయన తెలిపారు. మీ ఆధార్ కు మొబైల్ నంబర్ అనుసంధానం చేయడం కోసం ఆధార్ కేంద్రాలతో పాటు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో కూడా మొత్తం 24 కేంద్రాలను జిల్లాలో ఏర్పాటు చేశామని, ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తిచేశారు. జిల్లాలో 24 కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వివరాలు తెలుసుకునేందుకు http://www.medak.telangana.gov.in/service వెబ్ సైట్ ను సందర్శించాలని జిల్లా ప్రజలకు సూచించారు.
- February 18, 2021
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- AADHAR
- COVID19
- medak
- ఆధార్
- కోవిడ్-19 వాక్సిన్
- మెదక్
- Comments Off on ఆధార్ లింక్ గడువు పెంపు