సారథి, చొప్పదండి: టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటూ.. వారిని వంచనకు గురిచేస్తూ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జ్ మేడిపల్లి సత్యం విమర్శించారు. మంగళవారం చొప్పదండి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్ ఉపఎన్నికల నేపథ్యంలో దళితబంధు అంటూ మరో కొత్త నాటకానికి తెరదీశారని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో దళితబంధు పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని, లేకపోతే దళితులంతా సంఘటితమై ఈ నయా నిజాం నవాబుపై పోరాడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీతోనే దళితులతో పాటు అన్నివర్గాల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో ల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, పట్టణాధ్యక్షుడు ముద్దం తిరుపతి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పురం రాజేశం, మాజీ ఎంపీటీసీ ముద్దసాని రంగన్న, బీసీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రం రమేష్ గౌడ్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు గొల్లే సంపత్, కల్లెపెల్లి ప్రేమ్ కుమార్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ది రాజేందర్, నాయకులు కడారి శంకర్, కనుమల్ల రాజశేఖర్, బుచ్చి లింగన్న పాల్గొన్నారు.
- August 3, 2021
- Archive
- కరీంనగర్
- షార్ట్ న్యూస్
- CM KCR
- dalithabadhu
- huzurabad
- దళితబంధు
- సీఎం కేసీఆర్
- హుజూరాబాద్
- Comments Off on ‘దళితబంధు’ పేరుతో కొత్తనాటకం