సామాజికసారథి, మందమర్రి (మంచిర్యాల): మందమర్రి సింగరేణి పర్సనల్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ గ్రేడ్-ఏ విధులు నిర్వహించి బుధవారం పదవి విరమణ పొందిన సీఎస్ కనాన్ ను మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఇన్చార్జ్ జీఎం కృష్ణారావు బుధవారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1983 లో సింగరేణి సంస్థలో జనరల్ మజ్దూర్ గా మందమర్రి ఏరియా వర్క్ షాపులో ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయికి ఎదిగి క్రమశిక్షణతో, నిబద్ధతతో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్నారని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడున్న యువత ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో ఏజీఎంలు చక్రవర్తి, రామమూర్తి, పీఎం వరప్రసాద్, పీవో రాజలింగు, దామోదర్, జీఎం కార్యాలయ హెచ్వోడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
- August 31, 2022
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- manadamarri
- SINGARENI
- మందమర్రి
- సింగరేణి
- Comments Off on ఘనంగా వీడ్కోలు సన్మాన సభ