సామాజిక సారథి, బడంగ్ పేట్: చెరువుల సుందరికరణకు 8కోట్ల నిధులు మంజూరు చేసినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే విద్యా, వైద్యం, రోడ్లు, లైట్లు, డ్రైనేజీ, తాగునీరు, కనీస సౌకర్యాలతో పాటు మహేశ్వరం నియోజకవర్గం పర్యాటక రంగం వైపుకు అడుగులు వేస్తుందన్నారు. ఇప్పటికే మీర్ పేట్ చందనం చెరువు మినీట్యాంక్ బండ్ గా మారిందని, దీంతో ప్రతిరోజు పెద్దఎత్తున సందర్శకులు ఉదయం, సాయంత్రం వస్తూ, వాకింగ్, వ్యాయామం, చిన్నపిల్లలతో సందర్శిస్తున్నట్లు ఆమె చెప్పారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్ గూడలో గల కోమటి కుంట సుందరికరణకు రూ. 2.50కోట్లతో పోచమ్మకుంటకు రూ. 2కోట్ల నిధులు, మల్లాపూర్ సుధామోని కుంట చెరువు సుందరికరణకు రూ. 2కోట్లు, గుర్రం గూడ ఎక్కమోని కుంట కట్ట మరమ్మతులకు రూ.50లక్షలు, కుర్మల్ గూడ చెరువు కట్ట పటిష్టత కోసం రూ.1కోట్ల నిధులు విడుదలయ్యాయనని తెలిపారు.
- October 26, 2022
- Archive
- లోకల్ న్యూస్
- విద్యాశాఖమంత్రి
- సబితాఇంద్రారెడ్డి
- Comments Off on చెరువుల సుందరికరణకు 8కోట్ల నిధులు మంజూరు