న్యూఢిల్లీ: బంతిపై మెరుపు కోసం కొత్త ప్రతిపాదనను సిద్ధం చేశాడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. ఉమ్మిని నిషేధించిన నేపథ్యంలో.. 50, 55 ఓవర్లకు ఓ కొత్త బంతిని ఇస్తే బాగుంటుందని సూచించాడు. దీనివల్ల బంతిపై మెరుపు తగ్గకుండా చూడొచ్చన్నాడు. ‘టెస్ట్ మ్యాచ్ ల్లో ప్రమాణాలు చాలా ముఖ్యం. పిచ్ లు బాగా లేకుంటే ఇవి తగ్గిపోతాయి. అప్పుడు ఆట నెమ్మదిస్తుంది. ఇలాంటి పిచ్ లపై సహనంతో బౌలింగ్ చేయడానికి బౌలర్లు అలవాటు చేసుకోవాలి. కానీ ప్రతి 55 ఓవర్లకు ఓ కొత్త బంతిని ఇవ్వాలి. దీని ద్వారా ఆటలో కొత్త ఉత్తేజం వస్తుంది. వన్డేల్లో 50 ఓవర్లకే రెండు కొత్త బంతులు ఇస్తున్నారు. అంటే 25 ఓవర్లకు ఒకటన్న మాట. ఆ లెక్క ప్రకారమే టెస్ట్ ల్లోనూ కొద్దిగా అటుఇటు చేస్తూ కొత్త బంతుల పద్దతిని తీసుకురావాలి’ అని సచిన్ సూచించాడు. ప్రస్తుతం టెస్ట్ ల్లో 80 ఓవర్ల తర్వాత కొత్త బంతిని ఉపయోగించుకునేందుకు అనుమతి ఇస్తున్నారు.
- June 10, 2020
- Top News
- క్రీడలు
- BALL
- SACHIN
- టెస్ట్ మ్యాచ్
- బౌలర్లు
- Comments Off on 50 ఓవర్లకో కొత్త బంతి