సారథి న్యూస్, రామగుండం: సింగరేణి ఆర్జీ–1 డివిజన్ పరిధిలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో మంగళవారం నిర్వహించిన ఆర్మీ రిక్రూట్ మెంట్ టెస్టులో 50 మంది యువకులు ఎంపికయ్యారు. దరఖాస్తు చేసుకున్న 147 మంది అభ్యర్థులకు అన్నిరకాల పరీక్షలు నిర్వహించారు. జీఎం కె.నారాయణ ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఊపి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని ప్రారంభించారు. ఎంపికైన అభ్యర్థులకు 45 రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు జి.దామోదర్ రావు, ఎస్ వో–2 జీఎం త్యాగరాజు, మేనేజర్ ఎస్ రమేష్, సివిల్ డీజీఎం నవీన్, మదన్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
- January 19, 2021
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- ARMY RECRUITMENT
- RAMAGUNDAM
- SINGARENI
- ఆర్మీ రిక్రూట్మెంట్
- రామగుండం
- సింగరేణి
- Comments Off on ఆర్మీ రిక్రూట్మెంట్లో 50 మంది ఎంపిక