న్యూఢిల్లీ: 4జీ అప్‌గ్రేడేషన్‌లో చైనా టెలికాం పరికరాలను ఉపయోగించొద్దని భారత్ సంచార్ నిగమ్ లిమిలెట్ (బీఎస్ఎన్ఎల్)కు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ (డీవోటీ) కోరింది. దీనికి సంబంధించి టెండర్ ప్రాసెస్‌ను కూడా సమీక్షించాలని చెప్పినట్లు అధికారులు చెప్పారు. ఎంటీఎన్ఎల్కు కూడా దీనికి సంబంధించి సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. అప్‌గ్రెడేషన్‌కు చైనా పరికరాలను ఉపయోగించొద్దని అనుబంధ సంస్థ మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)కు డీవోటీ సూచించింది. సెక్యూరిటీ ఇష్యూస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
చైనా తయారుచేసిన సెక్యూరిటీ ఎక్విప్మెంట్ ఎప్పటికైనా డేంజరే అని ఒక అధికారి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెయిల్, వొడాఫోన్, ఐడియా హువాయితో కలిసి పనిచేస్తుండగా.. బీఎస్ఎన్ఎల్ మాత్రం జెడ్‌టీఈతో కలిసి పనిచేస్తోంది. కాగా.. ప్రస్తుతం ఇండియా–చైనా బోర్డర్లో నెలకొన్న పరిస్థితుల కారణంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. చైనాకు చెందిన 52 యాప్‌లు యూజ్ చేయడం సేఫ్ కాదని, వాటి వాడకాన్ని తగ్గించాలని, లేదా బ్యాన్ చేయాలని సూచిస్తూ మన ఇంటెలిజెన్స్ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు.