సామాజిక సారథి, బిజినేపల్లి: డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 54వ పుట్టినరోజున 357మంది రక్తదానం చేసినట్లు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు పసుపుల రామకృష్ణ తెలిపారు. ఈ సందర్బంగా మంగళవారం సర్వీంగ్ హాండ్స్ పాలమూరు రక్తనిధి తలసేమియా అండ్ సికిల్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్ లో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్ష, కార్యదర్శులు కొత్తపల్లి కుమార్, చింతల విజయ్ ముదిరాజ్, బోనాసి రాంచందర్, జిల్లా నాయకులు అంతటి నాగన్న, జిల్లా కోశాధికారి కారంగి బ్రహ్మయ్య, స్వేరోస్ నాయకులు గిద్ద విజయ్ కుమార్, గుడిపల్లి భాస్కర్, వెంకట్ రెడ్డి, సందీప్, హర్ష, ఖాజా, కొత్తపల్లి సుభాష్, సైదులు, టోనీ, శివలతో పాటు, బీఎస్పీనాగర్కర్నూల్ నియోజకవర్గ నాయకులు పృథ్వీ రాజ్, పరుశరామ్, శ్రీను, నాగేష్, శేఖర్, సాయి, ఆనంద్, కోడిదెల సురేష్, రాజ్, కృష్ణ, సురేష్, విష్ణు, బాలరాజ్, శ్రీనివాస్, మహేష్, శేషు, ఉమేష్, శివ, రాధాకృష్ణ, రమేష్ పాల్గొన్నారు.
- November 23, 2021
- Archive
- Top News
- లోకల్ న్యూస్
- Comments Off on ఆయన పుట్టినరోజున 357మంది రక్తదానం