Breaking News

రామడుగులో 2కే రన్​ సక్సెస్​

రామడుగులో 2కే రన్​సక్సెస్​

సామాజిక సారథి, రామడుగు: జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఫిట్ రామడుగు సంస్థ, స్థానిక క్రీడాకారుల ఆధ్వర్యంలో కరీంనగర్ ​జిల్లా రామడుగు మండల కేంద్రంలోని రైతువేదిక నుంచి స్థానిక ప్రభుత్వ హైస్కూలు గ్రౌండ్​ వరకు 2కే రన్ నిర్వహించారు. పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు జెండా ఊపి ప్రారంభించారు. సుమారు 50 మంది యువకులు, క్రీడాకారులు ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు ధ్యాన్ చంద్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజేతలకు మొదటి బహుమతి గుర్రం తిరుమలేష్ కు రూ.1000, ద్వితీయ బహుమతి కడారి ఒనేందర్ కు రూ.600, తృతీయ ఎండీ అదిల్ కు రూ.400 బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు జిట్టవేని శ్రీను, మూల వెంకటేష్, సీనియర్ క్రీడాకారులు భరత్, జట్టుపల్లి అనిల్, కల్గెటి మునిందర్, గోనె శివకృష్ణ, సింహచారి, ఎస్.శ్రీకాంత్, ఎ.దిలీప్, ఆర్. రాకేష్ , ఎండీ.మొయిజ్, పురేళ్ల శ్రీకాంత్, పెందోట రాజు, ఏ.మధు, డి.రాజు, ఆర్.నాగరాజు, ఇతర క్రీడాకారులు, యువకులు పాల్గొన్నారు.