సారథి న్యూస్, హైదరాబాద్: విరసం నేత వరవరరావు అక్రమ నిర్బంధానికి నిరసనగా ఈనెల 25వ తేదీన రాష్ట్ర ప్రజలు బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేసింది. అర్బన్ నక్సల్స్ పేరుతో అరెస్టు చేసిన వరవరరావు, ప్రొఫెసర్ సాయిబాబాతో సహా 12 మందిని, 60 ఏళ్లు పైబడిన రాజకీయ ఖైదీలను ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ ఉపా, ఎన్‌ఐఏ కేసులను ఎత్తేయడంతోపాటు అడవుల నుంచి గ్రేహౌండ్స్ దళాలను వెంటనే వెనక్కి పిలవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కమిటీతోపాటు 12 ఏరియా కమిటీలను మావోయిస్టు పార్టీ ప్రకటించింది.
- July 22, 2020
- Archive
- షార్ట్ న్యూస్
- JAGAN LETTER
- MAOIST
- SAIBABA
- VARAVARARAO
- మావోయిస్టులు
- వరవరరావు
- సాయిబాబా
- Comments Off on 25న బంద్కు మావోయిస్టుల పిలుపు