సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో 23 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పక్కా సమాచారంతో బిజినేపల్లి ఎస్సై వెంకటేశ్ తన సిబ్బందిపై శనివారం అజిత్బాషా ఇంటిపై దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. గతకొద్దిరోజులుగా గంజాయికి అలవాటుపడ్డ కొందరు యువకులు విచ్చలవిడిగా తాగుతూ ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా వారిపై నిఘా ఉంచి గంజాయిని విక్రయిస్తున్న వారిని పట్టుకున్నామని ఎస్సై తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
- June 26, 2021
- Archive
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- BIJINEPALLY
- cannabis
- NAGARKURNOOL
- గంజాయి
- నాగర్కర్నూల్
- బిజినేపల్లి
- Comments Off on గంజాయి గుట్టురట్టు