కొలంబో: 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఫిక్సయిందని అప్పటి శ్రీలంక క్రీడా మంత్రి మహిందానంద అల్తుగమాగే సంచలన ఆరోపణలు చేశాడు. ఆ మ్యాచ్ ను లంక.. భారత్‌కు అమ్మేసుకున్నదని విమర్శించాడు. ‘ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ మేం అమ్మేసుకున్నామని నేను ఈ రోజు చెబుతున్నా. అప్పుడు నేనే క్రీడా మంత్రిగా ఉన్నా.. ఆ సమయంలో చెప్పే అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు చెప్పడం నా బాధ్యతగా భావిస్తున్నా’ అని మహిందానంద వ్యాఖ్యానించాడు. 2010 నుంచి 2015 వరకు లంక క్రీడల మంత్రిగా పని చేసిన అల్తుగమాగే.. ప్రస్తుతం విద్యుత్ శాఖ మంత్రిగా పని చేస్తున్నారు. ఓ వర్గం ఈ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడిందన్నాడు. దీనిపై లంక ప్లేయర్లు జయవర్దనే, సంగక్కర తీవ్రంగా స్పందించారు. ఆధారాలు ఉంటే ఐసీసీకి ఇచ్చి విచారణకు డిమాండ్ చేయాలన్నారు. ఎన్నికలు రాబోతుండటంతో.. సర్కస్ మళ్లీ మొదలైందని విమర్శించారు.
- June 19, 2020
- Archive
- క్రీడలు
- FINAL MATCH
- FIXING
- INDIA
- SRILANKA
- క్రీడా మంత్రి
- మహిందానంద
- Comments Off on 2011 ప్రపంచకప్ ఫైనల్‌ను అమ్మేశారు