మే 20న తారక్ పుట్టిన రోజు అయితే మరో స్టార్ హీరో మంచు బర్త్ డే కూడా ఈ రోజే. చాలా రోజుల గ్యాప్ తర్వాత ‘అహం బ్రహ్మస్మి’ సినిమాతో తెరమీదికి రానున్నాడు మనోజ్. ఎన్.శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న ఈ సినిమా టీమ్ మనోజ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇంతకుముందు ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజై అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఎందుకంటే మనోజ్ ఈ సినిమాలో అఘోరా పాత్ర పోషించనున్నాడని..
హ్యాపీ బర్త్ డే డియర్ మనోజ్
డిఫరెంట్ యాంగిల్స్‌లో ఈ సినిమాలో కనిపించనున్నాడని ఆ లుక్ తెలిపితే.. బుధవారం విడుదల చేసిన ఈ పోస్టర్లో మనోజ్ విక్రమసింహపురి రాజా అని తెలుస్తోంది. అంటే మనోజ్ ఈ సినిమాలో వైవిధ్యమైన క్యారెక్టర్ చేస్తున్నాడని అర్థమవుతోంది. ఇంకెన్ని ట్విస్ట్‌లు ఈ సినిమాలో దాగి ఉన్నాయో కాని ప్రస్తుతానికి ఈ అప్డెట్తో మనోజ్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.