రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ఆ రాష్ట్ర మంత్రి మిథిలేశ్ ఠాకూర్, పార్టీ ఎమ్మెల్యే మథుర మహకు కరోనా పాజిటివ్ రావడంతో సోరెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ముందు జాగ్రత్త చర్యగానే తాను స్వీయనిర్బంధంలోకి వెళుతున్నానని హేమంత్ సోరెన్ ట్వీట్ చేశారు. తన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది, అధికారులు హోంక్వారంటైన్కు వెళ్లాలని ఆయన కోరారు. తాను ఇంటినుంచే ముఖ్యమైన పనులు నిర్వహిస్తానని చెప్పారు. ఇక దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 22,752 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి బారినపడి ఒక్కరోజే 482 మంది మరణించారు.
- July 8, 2020
- Archive
- Top News
- జాతీయం
- CARONA
- CM
- HEMANTH SOREN
- MINISTER
- RANCHI
- జార్ఖండ్ సీఎం
- హేమంత్ సోరెన్
- Comments Off on హోంక్వారంటైన్ లోకి జార్ఖండ్ సీఎం