సారథి న్యూస్, హైదరాబాద్: ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో అమరజవాన్ కల్నల్ సంతోష్ బాబు సతీమణి, పిల్లలు బుధవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ వారిని రిసీవ్ చేసుకున్నారు. అమరజవాన్ కుటుంబసభ్యులతో సీపీ, ఇతర పోలీస్ అధికారులు చాలా సేపు వారితో మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. వారిని ప్రత్యేక వాహనంలో సూర్యాపేటకు తీసుకెళ్లనున్నారు. మంగళవారం చైనా బలగాల దొంగ దెబ్బకు కల్నల్ సంతోష్‌బాబు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో యావత్ దేశమంతా దిగ్ర్భాంతికి గురైంది.
- June 17, 2020
- Archive
- Top News
- జాతీయం
- SANTHOSH BABU
- SURYAPETA
- సంతోష్ బాబు
- సూర్యాపేట
- Comments Off on హైదరాబాద్‌కు చేరిన కల్నల్ కుటుంబసభ్యులు