Breaking News

హెబ్బా నెవర్ బిఫోర్ అబ్బ!

హెబ్బా నెవర్ బిఫోర్ అబ్బ!

ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో గ్లామర్ పాత్రలతో అలరించిన హెబ్బాపటేల్ ఈసారి డీ గ్లామరస్​క్యారెక్టర్ లో కనిపించనుంది. క్రైమ్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమాలో చక్కనైన చీరకట్టుతో పల్లెటూరి మహిళ రాధ పాత్రను పోషించింది. దీపావళి సందర్భంగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్ ను విడుదల చేసింది మూవీ టీమ్. పల్లెటూరులో ఇంటి బయట కూర్చుని చేటలో బియ్యం ఏరుతున్న సాధారణ మహిళగా కనిపిస్తున్న హెబ్బా లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్న సినిమాతో అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కేకే. రాధామోహ‌న్ నిర్మిస్తున్నారు. ‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా డిఫరెంట్ క్రైమ్‌ థ్రిల్లర్‌ స్టోరీతో రూపొందిస్తున్నారు. క‌న్నడ‌ నటుడు వ‌శిష్ట సింహ, పూజిత పొన్నాడ, సాయి రోనక్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. హెబ్బా లుక్ కు నెటిజన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్న క్రమంలో సంపత్ నంది కూడా ‘హెబ్బా నెవర్ బిఫోర్ అబ్బ!’ అంటూ ట్వీట్ చేశాడు.