సోమవారం ఈద్ పండుగను ముస్లిం సోదరులంతా ఘనంగా జరుపుకున్న సందర్భంగా బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ హిందూ ముస్లింల సఖ్యత చాటుతూ ఓ పాప్ సాంగ్‌ను తన అభిమానులకు గిఫ్ట్ చేశాడు. విశాలమైన ప్రదేశంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా జస్ట్ ఒక వుడ్ చైర్లో కూర్చొని.. ఓ మైక్ చేతబుచ్చుకుని.. ఈజీ స్టెప్స్‌తో ఈ పాటను పాడాడు సల్మాన్. ఈ సాంగ్‌ను సల్మాన్ స్వయంగా పాడడమే కాదు.. దనిష్ శబ్రితో కలిసి సల్మాన్ సొంతగా లిరిక్స్ సమకూర్చాడు. ర్యాప్ పోర్షన్ ను రుహానా అర్షద్ రాయగా సాజిద్ వాజిద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్‌ను యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు.
‘యారోంకె హమ్ తయ్యార్.. కర్ అప్నే హితే వార్ హై..’ అంటూ సాగే ఈ సాంగ్‌లో ‘రమజాన్ మే హై రామ్.. దీవాలీ మే హై అలీ .. హిందూ ముస్లిం సిక్ సాయి సబ్ అప్నే భాయ్ భాయ్..’ అన్న చరణాలు చాలా ఆకట్టుకుంటున్నాయి. కరోనా బాధితులు కొంతమందికి ఆర్థికంగా కూడా సాయపడిన సల్మాన్.. ఈ లాక్ డౌన్ సమయంలో రిలీజ్ చేసిన మూడో పాప్ సాంగ్ ఇది. హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ ఉన్న ఈ పాటలో 2020లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా ప్రస్తావించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాప్ సాంగ్ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు భాయ్ సల్మాన్.