బెంగళూరు: లాక్‌డౌన్‌తో రెండున్నర నెలలుగా సాయ్ సెంటర్లో ఉంటున్న భారత పురుష, మహిళల హాకీ జట్లకు నెల రోజుల విరామం ఇచ్చారు. ఇంటిపై బెంగతో కొంత మంది ప్లేయర్లు ఇబ్బందులు పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో చాలా మంది తమ సొంత ప్రదేశాలకు వెళ్లిపోయారు. అయితే ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో.. గోల్ కీపర్ సురజ్ కర్కెరా.. సాయ్ సెంటర్లోనే ఉండిపోయాడు. ఇక మహిళల టీమ్‌కు చెందిన వందన కటారియా (ఉత్తరాఖండ్), సుశీల (మణిపూర్), లాల్రెసిమియా (మిజోరామ్) కూడా వాళ్ల రాష్ట్రాలకు వెళ్లలేదు. కరోనా ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్లు అక్కడికి వెళ్లినా.. 14 రోజుల క్వారంటైన్ ఉండాల్సి రావడంతో ఇక్కడే ఉండిపోయారు. అంతర్జాతీయ ప్రయాణ నిషేధం కొనసాగుతుండటంతో పురుషుల టీమ్ కోచ్ గ్రాహమ్ రీడ్, సహాయక సిబ్బంది బెంగళూరులో ఉండిపోయారు.
- June 20, 2020
- Archive
- క్రీడలు
- HOCKEY
- HOMESICK
- PLAYERS
- సాయ్ సెంటర్
- సురజ్ కర్కెరా
- Comments Off on హాకీ ప్లేయర్లకు నెల రోజుల విరామం