Breaking News

హత్రాస్​ అట్టుడుకుతోంది.. రాహుల్​ అరెస్ట్​

లక్నో: దళిత యువతిపై లైంగికదాడి, హత్యతో యూపీలో హత్రాస్​ ప్రాంతం అట్టుడుకుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా పలు చోట్ల దళితసంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. అయితే గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు హత్రాస్​ వెళ్లన కాంగ్రెస్​ యువనేత రాహుల్​, ప్రియాంకా గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్​ అరెస్ట్​తో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ కార‍్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు.శాంతియుతంగా హత్రాస్​ వెళ్తున్న తమపట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించారని రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. యమున ఎక్స్‌ప్రెస్‌ వేపై తమను పోలీసులు అడ్డగించి తనను తోసివేస్తే కిందపడ్డానని రాహుల్‌ పేర్కొన్నారు. అయితే కరోనా నిబంధనల మేరకు రాహుల్​ను అరెస్ట్​ చేసినట్టు పోలీసులు తెలిపారు. రాహుల్​ వస్తున్నారని తెలుసుకుని కార్యకర్తలు, దళితసంఘాలు పెద్ద ఎత్తున హత్రాస్​ ​కు చేరుకున్నారు. దీంతో అక్కడ కొంత హైటెన్షన్‌ నెలకొంది. యూపీలోని హత్రాస్​ లో పొలం పనులకు వెళ్లిన దళిత యువతిపై దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచారు. బాధితురాలు మృత్యువుతో పోరాడుతూ ఢిల్లీ ఆస్పత్రిలో మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు.