సారథి న్యూస్, హైదరాబాద్: భారత్ -చైనా సరిహద్దు ఘర్షణలో వీరమరణం చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు పార్థివదేహం బుధవారం హకీంపేట విమానాశ్రయానికి చేరింది. కల్నల్ సంతోష్ పార్థివదేహానికి గవర్నర్ తమిళిసైతో పాటు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి నివాళులు అర్పించారు. గురువారం ఉదయం సూర్యాపేటలోని కేసారంలో కల్నల్ సంతోష్ అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరగనున్నాయి. అంతిమ యాత్ర కోసం అధికారులు ప్రత్యేక వాహనాన్ని సిద్ధంచేశారు.
- June 18, 2020
- Archive
- Top News
- జాతీయం
- COLNOL
- SANTHOSH BABU
- గవర్నర్ తమిళిసై
- సూర్యాపేట
- Comments Off on హకీంపేటకు కల్నల్ సంతోష్ పార్థివదేహం