సారథి న్యూస్, విజయనగరం: జిల్లాలో లాక్ డౌన్ పరిస్థితులను విజయనగరం ఎస్పీ బి.రాజకుమారి బుధవారం పర్యవేక్షించారు. కరోనాను అరికట్టేందుకు ప్రతిఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని ప్రజలకు సూచించారు. ప్రధాన జంక్షన్లు, రైతుబజార్లు తదితర ప్రాంతాల్లో ఆమె పర్యటించారు.
మూకుమ్మడిగా వ్యాపారాలు చేయొద్దని, సరిహద్దు జిల్లాలో కూడా కరోనా కేసులు నమోదుకావడంతో పోలీసు అధికారులు, సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. విజయనగరం డీఎస్పీ పి.వీరాంజనేయరెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, వన్ టౌన్ సీఐ ఎర్రంనాయుడు, టూటౌన్ సీఐ డి.శ్రీహరిరాజు, వన్ టౌన్ సీఐ ఎర్రంనాయుడు, టూటౌన్ సీఐ శ్రీహరిరాజు పాల్గొన్నారు.