సారథి న్యూస్, కర్నూలు: నగరాన్ని ‘స్వచ్ఛ కర్నూలు’గా తీర్చిదిద్దేందుకు నగరంలోని ప్రతిఒక్కరూ సహకరించాలని నగర పాలక కమిషనర్ డీకే బాలాజీ కోరారు. శనివారం స్థానిక ఉర్దూ ఘర్ లోని దుకాణదారులతో మాట్లాడుతూ.. నగరంలో పూర్తిస్థాయిలో ప్రతి దుకాణ యజమాని ఒక చెత్తబుట్టను ఏర్పాటు చేసుకుని పారిశుద్ధ్య కార్మికులకు తప్పకుండా ఇవ్వాలన్నారు. ఆరుబయట చెత్తపారబోస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జాతీయ స్థాయిలో ఇచ్చే స్వచ్ఛ సర్వేక్షణ్ర్యాంకుల్లో ఈసారి కర్నూలు నగరాన్ని మెరుగైన స్థానంలో ఉంచేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. ప్రస్తుతం కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు అహర్నిశలు శ్రమిస్తూ నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు తోడ్పాటు ఇవ్వాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ శానిటరీ సూపర్ వైజర్ నాగరాజు, శానిటరీ ఇన్స్పెక్టర్లు హరనాథ్, మూర్తజావలి పాల్గొన్నారు.
- September 5, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- Kurnool
- SWACHHA SARVEKSHAN
- కరోనా
- కార్పొరేషన్
- స్వచ్ఛ కర్నూలు
- స్వచ్ఛ సర్వేక్షణ్
- Comments Off on స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దుదాం