Breaking News

స్మార్ట్​ మాస్క్​ వచ్చేసింది

టోక్యో: కరోనా విజృంభిస్తున్న తరుణంలో మాస్క్​ లేనిది అడుగు బయటపెట్టలేని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో జపాన్​కు చెందిన ఓ స్టార్టప్​ కంపెనీ వినూత్నంగా ఆలోచించి ‘స్మార్ట్​ మాస్కు’ తయారుచేసింది. ఇంటర్నెట్​కు, మనం వాడే స్మార్ట్​ ఫోన్​కు ఈ మాస్క్​ను అనుసంధానం చేసుకోవచ్చు. ఈ మాస్కును బ్లూటూత్​ ద్వారా మొబైల్​ యాప్​తో కనెక్ట్​ చేసుకోవచ్చని డోనట్​ రోబోటిక్స్​ సీఈవో తైసుకే ఓనో తెలిపారు. ఈ సీ​-మాస్క్​ ద్వారా కాల్స్​ చేయొచ్చని, మెసేజ్​లను కూడా పంపించుకోవచ్చన్నారు. జపాన్‌ భాష నుంచి 8 ఇతర భాషల్లోకి సీ-మాస్కు ద్వారా యాప్ పదాల్ని‌ తర్జుమా చేస్తుందని అన్నారు. జపాన్‌ మార్కెట్లోకి వచ్చే సెప్టెంబర్‌ నాటికి 5000 యూనిట్లు పంపిస్తామని అన్నారు. అమెరికా, చైనా, యూరప్‌లలో వీటిని ఆదరిస్తారనే నమ్మకముందన్నారు. సీ-మాస్కు ధర రూ.3 వేలుగా నిర్ణయించారు.