‘అరణ్య’ చిత్ర రిలీజ్కోసం ఈగర్ గా వెయిట్‌చేస్తున్న రానా రీసెంట్గా ఓ తమిళ మూవీలో నటించనున్నాడన్న టాక్వినిపిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజస్‌లో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘అరణ్య’ రిలీజ్లాక్డౌన్కారణంగా నిలిచిపోయింది. రానా ప్రస్తుతం ‘విరాటపర్వం’ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. వేణు ఊడుగుల దర్శకత్వంలో నక్సలైట్బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ చిత్రంలో రానా నక్సలైట్‌గా కనిపించనున్నాడు. డాక్టర్రవిశంకర్కామ్రేడ్రవన్నగా ఎలా మారాడు అన్నది స్టోరీ.
డిసెంబర్ 14న రానా బర్త్ డే సందర్భంగా టీమ్ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి కలిగించింది టీమ్. దీని తర్వాత రానా ‘అయ్యప్పనుమ్కోషియమ్’ మలయాళ రీమేక్ లో నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆ తర్వాత రానా గుణశేఖర్ చిత్రం ‘హిరణ్యకశ్యప’ లో నటించాల్సి ఉంది. బాబాయ్వెంకటేష్మూవీ కూడా చేస్తాడన్న టాక్ కూడా నడుస్తోంది. ఇంతలో ఈ వార్త వచ్చింది. సిద్దార్థ హీరోగా వచ్చిన ‘గృహం’ ఫేమ్మిలింద రాయ్రానాకు సూపర్ నేచురల్ థ్రిల్లర్స్టోరీ ఒకటి వినిపించాడని.. ‘ధీరుడు’ అనే టైటిల్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తారని.. లైన్నచ్చడంతో వెంటనే ఓకే అనేశాడని అంటున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో గోపీచంద్ఆచంట నిర్మించేందుకు చర్చలు కూడా జరుగుతున్నాయట. ప్రస్తుతం మిలింద్లేడీ సూపర్స్టార్నయనతారతో ‘నేట్రికన్’ మూవీ తెరకెక్కించే పనిలో ఉన్నాడు. ఆ మూవీ ఫినిష్అయ్యాక ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుండొచ్చేమో.. లేదా ఈ లోపే రానా ఏదైనా అప్డేట్ఇవ్వొచ్చేమో వేచిచూద్దాం..!