Breaking News

స్పిన్ దిగ్గజం రాజిందర్ కన్నుమూత

న్యూఢిల్లీ: వయసు సంబంధించిన అనారోగ్య సమస్యలతో దేశవాళీ క్రికెట్ దిగ్గజ స్పిన్నర్ రాజిందర్ గోయల్ (77) కన్నుమూశారు. ఆయనకు భార్య, ఓ కొడుకు ఉన్నాడు. 157 ఫస్ట్ క్లాస్ మ్యాచ్​లు ఆడిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ 750 వికెట్లు తీశారు. హర్యానా, నార్త్​జోన్​కు ప్రాతినిధ్యం వహించారు. ఆట పరంగా అత్యుత్తమ స్పిన్నరే అయినా.. బిషన్ సింగ్ బేడీ నీడలో ఆయనకు టీమిండియాకు ఆడే అవకాశం దక్కలేదు. బీసీసీఐ జీవితకాల సాఫల్య పురస్కారంతో పాటు అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు. 1974–75లో వెస్టిండిస్​తో జరిగిన సీరిస్​కు రాజిందర్ ఎంపికైనా.. 12వ ఆటడిగా ఉండటంతో మ్యాచ్ ఆడే అవకాశం రాలేదు. దీంతో ఈ సిరీస్ కోసం కొత్తగా కొనుక్కున్న బూట్లు, కిట్ను అలాగే వదిలేశాడు. కానీ కాలక్రమంలో బేడీ టీమ్​లోకి రావడంతో రాజిందర్.. భారత్కు ఆడే అవకాశాన్ని సంపాదించలేకపోయాడు.