సిరివెన్నెల సినిమాలో మురిపించిన మున్ మున్ సేన్ కుమార్తె రియా సెన్ తెలుసా మీకు? బాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ ‘స్టైల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. 2007లో తెలుగులో మంచు మనోజ్‌తో ‘నేను మీకు తెలుసా?’ సైకలాజికల్ థ్రిల్లర్ లో లీడ్ రోల్ చేసింది. తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేసింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం తన హాట్ హాట్ ఫొటోలతో హల్ చల్ చేస్తూ ఉంటుంది. కుర్రాళ్లకు మతిపోగొట్టే ఫోజులిస్తూ.. ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఇటీవల మరీ రెచ్చిపోతోంది. ఈ రచ్చ అంతటికీ కారణం ఏమిటా అని ఆరాతీస్తే ఈ భామ తన సొంత యాప్‌ను మార్కెట్లోకి తెచ్చే ఆలోచనలో ఉందిట. అందుకోసం ఇప్పటికే అఫీషియల్‌గా యాప్‌ను కూడా రెడీ చేసిందట. ఈ యాప్‌లో తనకు సంబంధించిన సమాచారంతో పాటు వాణిజ్య ప్రకటనలను కూడా వైరల్ చేస్తుందట. అంతేకాదు ఈ యాప్ వల్ల నిరంతరం అభిమానులకు డైరెక్ట్ గా టచ్‌లో ఉంటుందట. తద్వారా తనను అభిమానించే వాళ్లు డైరెక్ట్‌గా తనతో మాట్లొచ్చని, డైరెక్ట్ గా తనని చూడొచ్చని చెబుతోంది. ఇంకా బోలెడన్ని వీడియోలు కూడా ఈ యాప్‌లో షేర్ చేస్తుందట.
లండన్ లో ఫ్యాషన్ బ్రాండింగ్ కోర్సు పూర్తిచేసిన రియా తన బిజినెస్ కోసం దేనికైనా రెడీ అంటోంది. ఇంతకీ ఈ యాప్‌లో ఏముంటాయి అనుకుంటున్నారా.. ఎవరికి ఎలాంటి బ్రాండ్ సూటవుతుంది.. ఫ్యాషన్ కు సంబంధించిన టిప్స్.. మేకప్ కు సంబంధించిన సలహాలు మాత్రమే కాదు.. గర్ల్‌ఫ్రెండ్‌తో ఎలా మూవ్ అవ్వాలో కూడా చెబుతుందట. ఇంకా ఐదారు నిమిషాల వెబ్ సిరీస్ కు సంబంధించిన వీడియోలు, తన గురించి ఫన్నీ ఎమోటికాలు కూడా ఉంటాయట. వాటిని చూస్తే అది నా రియాక్షన్ గా మీరు భావిస్తారు అని అంటోంది. యాడ్ ద్వారానే ఇంతిలా ఊరిస్తోంది అంటే ఆ యాప్ కుర్రాళ్లను ఇంకెంత ఊపుతుందో. కానీ ఈ యాడ్ కోసం రియా సెమీ న్యూడ్ గా కనిపించేసరికి అంత అవసరమా? అంటూ టాపిక్‌ను హాట్ చేస్తున్నారు కొందరు.