– మంత్రి హరీశ్ రావుతో ఓ రైతు
సారథి న్యూస్, సిద్దిపేట: కరోనా నేపథ్యంలో ఏర్పాటుచేసిన తాత్కాలిక రైతు మార్కెట్లలో సామాజిక దూరం పాటించాలని కూరగాయలు విక్రయిస్తున్న రైతులు, కొనుగోలుదారులకు మంత్రి హరీశ్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ హైస్కూలులో ఏర్పాటుచేసిన తాత్కాలిక రైతు బజార్ ను మంగళవారం ఉదయం మంత్రి హరీశ్ రావు ఆకస్మికంగా పరిశీలించారు. రైతులు, కూరగాయల విక్రయదారులతో మాట్లాడారు. ‘తాత్కాలిక మార్కెట్లలో అనుకున్న విధంగా మీకు వెసులుబాటు ఉందా..?’ అని రైతులను అడిగి తెలుసుకున్నారు. ‘సౌలత్ లు బాగున్నయ్ సారూ’ అంటూ ఓ రైతు బదులిచ్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.