న్యూఢిల్లీ: పెద్దవాళ్లు భౌతికంగా దూరమైనప్పటికీ.. తమ పిల్లల్ని పైనుంచి చూస్తూనే ఉంటారని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. అదే సమయంలో జీవితంలో ముందుకు సాగడానికి మనకంటూ ఓ సొంత మార్గాన్ని ఎంచుకోవాలన్నాడు. ‘ఫాదర్స్’ డే సందర్భంగా చిన్నప్పుడు తండ్రితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశాడు. ‘కుటుంబాన్ని, తల్లిదండ్రులను ప్రేమించండి. మీ తండ్రి మీపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతతో ఉండండి. మీ కంటూ ఓ మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగండి. మీరెప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాదు. ఎందుకంటే నాన్న ఉన్నా లేకపోయినా.. పైనుంచి మనల్ని చూస్తూనే ఉంటాడు’ అని విరాట్ భావోద్వేగంతో వ్యాఖ్యానించాడు.
- June 22, 2020
- Archive
- Top News
- క్రీడలు
- CAPTAIN
- FATHER
- KOHLI
- విరాట్ కోహ్లీ
- సొంతమార్గం
- Comments Off on సొంత మార్గాన్ని వెతుక్కోండి: కోహ్లీ