సారథిన్యూస్, ఖమ్మం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలో రాష్ట్రానికే ఆదర్శనీయంగా రైతు వేదిక నిర్మిస్తున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రైతు వేదిక నిర్మాణపనులను బుధవారం మంత్రి పరిశీలించారు. ఈ రైతు వేదికను మంత్రి అజయ్ రూ.40 లక్షలు సొంత నిధులు వెచ్చించి నిర్మిస్తున్నారు. మంత్రి వెంట కలెక్టర్ ఆర్వీ కర్ణన్, ఎమ్మెల్సీ బాలసాని, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఏఎమ్సీ చైర్మన్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
- June 24, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- AJAY
- KAMMAM
- MINISTER
- PUVVADA
- రఘునాథపాలెం
- రైతు వేదిక
- Comments Off on సొంత నిధులతో రైతు వేదిక